ELR: అక్రమంగా పౌల్ట్రీ వ్యర్ధాలను తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి కాకినాడ జిల్లా రామచంద్రపురానికి బొలెరో వాహనంలో సుమారు మూడు టన్నుల వ్యర్ధాలను తరలిస్తుండగా.. జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై ఎస్సై ప్రసాద్ బృందం గుర్తించి పట్టుకుంది. వ్యర్థాలను సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అయన తెలిపారు.