»Naresh Pavitra Malli Pelli Movie Box Office Collection
Malli pelli: ‘మళ్లీ పెళ్లి’కి 16 కోట్లు పెట్టారు.. కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు
టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలిచిన జంట పవిత్ర లోకేష్ - నరేష్(Pavitra Lokesh - Naresh). వీరిద్దరు కలిసి `మళ్లీ పెళ్లి`(Malli pelli) అంటూ ఓ సినిమా తీశారు.
Malli pelli: టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలిచిన జంట పవిత్ర లోకేష్ – నరేష్(Pavitra Lokesh – Naresh). వీరిద్దరు కలిసి `మళ్లీ పెళ్లి`(Malli pelli) అంటూ ఓ సినిమా తీశారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి నరేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో జయసుధ, శరత్ బాబు(sharat Babu), వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ(annapurna) తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 26న ఈ చిత్రం ప్రేక్షకుల కోసం తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ అయింది.
నరేష్, పవిత్రల నిజ జీవిత సంఘటనలనే `మళ్లీ పెళ్లి` గా సినిమా తీశారు. ఇది బయోపిక్ కాదని, రమ్య రఘుపతి(Ramya ragupati)పై రివేంజ్ తీర్చుకోవడానికి సినిమా తీయలేదని నరేష్ చెప్పారు. కానీ, మళ్లీ పెళ్లి ద్వారా నరేష్ రమ్య రఘుపతిపై గట్టిగానే రివేంజ్ తీర్చుకున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. టాక్ అనుకూలంగా లేకపోవడంతో.. వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రూ. 16 కోట్ల బడ్జెట్(Budget) పెడితే మూడు రోజుల్లో కనీసం పోస్టర్(poster) ఖర్చులు కూడా రాలేదు. మొదటి రోజు రూ. 40 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. రెండవ రోజు రూ. 15 లక్షలు, మూడో రోజు రూ. 12 లక్షల గ్రాస్ ని రాబట్టింది. అలా మూడు రోజులకు కలిపి రూ. 67 లక్షల గ్రాస్ ని సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో పెద్దగా వసూళ్లు రాబట్టలేదని తేలిపోయింది.