Road Accident:అస్సాంలోని గౌహతి(Guwahati)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు(engineering students) మరణించారు. గౌహతిలోని జలుక్బరి ప్రాంతం(Jalukbari area)లో ఆదివారం రాత్రి వేగంగా వచ్చిన ఎస్యూవీ(SUV) డివైడర్ను ఢీకొట్టింది. తర్వాత కారు వేగం ఎక్కువగా ఉండడంతో డివైడర్ దాటి మరో లేన్లో వెళ్తున్న టాటా-407 కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో 6 మందికి గాయాలయ్యాయి. ఎస్యూవీ కారులో అజారా నుంచి విద్యార్థులు వస్తుండగా ప్రమాదం జరిగింది.
Assam | At least seven dead and several others injured in a road accident that took place in the Jalukbari area of Guwahati on Sunday late night. pic.twitter.com/5gELk04tCR
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అతను GMCH లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించినట్లు గౌహతి జాయింట్ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. వారిని అస్సాం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విచారం వ్యక్తం చేశారు.
Extremely anguished by the loss of young and precious lives in the road accident at Jalukbari. My deepest condolences to their parents and families.
Have spoken to authorities at GMCH. All possible medical assistance is being provided to those injured.
— Himanta Biswa Sarma (@himantabiswa) May 29, 2023
జలుక్బరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి శర్మ ట్వీట్లో పేర్కొన్నారు. బాధితుల కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) అధికారులతో కూడా మాట్లాడారు. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.