తమిళనాడులోని చెన్నై, మదురై వేదికగా ఇవాళ జూనియర్(U21) హాకీ ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. డిసెంబర్ 10 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు 6 గ్రూపులుగా తలపడనున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం 2016లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడిన భారత యువ జట్టు మరోసారి కప్ గెలిచేందుకు సిద్ధమైంది. ఇవాళ మొత్తం 8 మ్యాచులు జరగనుండగా.. భారత్ 8:30PMకు తన తొలి మ్యాచులో చిలీతో తలపడనుంది.