KDP: చాపాడు మండలం అయ్యవారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నడవలేక మంచానికే పరిమితమయ్యాడని ఆయన భార్య స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. రూ.5 లక్షలు ఖర్చు చేశామని, ఇక చికిత్స అందించుకోవడానికి దగ్గర స్తోమత లేదని దాతలు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.