VZM: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి, సీపీవో పీ. బాలాజీ, డీఈవో యు. మాణిక్యం నాయుడు, ఇతర జిల్లా అధికారులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రతిజ్ఞ చేయించారు.