HYD: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే, ప్రోత్సాహకంగా రూ. 10 లక్షల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో తాను మాట తప్పనని, కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని తెలిపారు. కాంగ్రెస్, BRS ఇలాంటి వాగ్దానాలు చేసి మోసం చేశాయని విమర్శించారు.