కృష్ణా: పెడన టౌన్ వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పెడన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఉప్పాల రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.