BHPL: విధి నిర్వహణలో మరణించిన మున్సిపల్ వర్కర్ రాజయ్య కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రెండో రోజు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ ఆందోళనకు మాజీ MLA GVR మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.