హైదరాబాద్ నగరంలోని జీనోమ్ వ్యాలీ ఇన్నోవేషన్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తరించింది. భారతదేశంలోనే తొలి సింగిల్-యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్ స్కేల్-అప్ సదుపాయం తెలంగాణ వన్ బయో(1BIO)ను ప్రారంభించింది. జీనోమ్ వ్యాలీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రి డి. శ్రీధర్ బాబు కొత్త జీనోమ్ వ్యాలీ లోగోను ఆవిష్కరించారు.