ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే భారత ఆర్థికవ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశాలు ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. భౌగోళిక రాజకీయాలు భారీ కుదుపులకు లోనవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం భారత్ 3.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉందన్నారు.