ATP: రాప్తాడు మండలం అంపాపురం సమీపంలోని మౌనగిరి క్షేత్రంలో కొలువై ఉన్న 39 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం 8వ వార్షికోత్సవంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మంగళవారం పాల్గొన్నారు. ఆయన స్వామివారికి క్షీరాభిషేకం చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులందరికీ మంచి పంటలు పండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.