TG: ముస్లింల దేశభక్తిని శంకించవద్దని.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదర్సాలలో బాంబుల తయారీ క్షమించరాని నేరమన్నారు. బాంబు పేలుళ్ల మృతుల్లో హిందువులే కాదు.. ముస్లింలూ ఉన్నారని ఆక్షేపించారు. మదర్సాలలో గదిని నిర్మించలేని మూర్ఖులు.. బాంబులు తయారు చేసి మతానికి చెడ్డపేరు తెస్తున్నారని ధ్వజమెత్తారు. దేశానికి శత్రువులు.. ముస్లింలకూ శత్రువులే అని వ్యాఖ్యానించారు.