PLD: రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ఎస్సైగా హరిబాబు మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మణికృష్ణను రాజుపాలెం పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. మణికృష్ణ స్థానంలో నరసరావుపేట టూటౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న హరిబాబును ఉన్నతాధికారులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని హరిబాబు తెలిపారు.