SRD: సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో షష్టి వేడుకలు బుధవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ కొక్కొండ శ్రీశైలం గురుస్వామి తెలిపారు. దేవాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు.