TG: HYD శాలిబండ అగ్నిప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్లోని రిఫ్రిజిరేటర్లు, AC కంప్రెషర్లలో భారీ పేలుళ్లు సంభవించినట్లు గుర్తించారు. పేలుళ్ల దాటికి గోమతి ఎలక్ట్రానిక్స్ ముందు పార్క్ చేసిన కారు పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టి బయట పడ్డ కాసేపటికే మంటలు వ్యాపించడంతో కారు దగ్ధమైంది. కారులో CNG పేలలేదని డ్రైవర్ స్పష్టం చేశాడు.