ప్రకాశం: ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా క్రైస్తవులు క్రిస్మస్ స్టార్స్‌ను ఏర్పాటు చేస్తుంటారు. కాగా, మార్కాపురం పట్టణంలో అర్ధరాత్రి నుంచి విద్యుత్ కాంతులతో క్రిస్మస్ స్టార్స్ మెరిసాయి. TBTC చర్చ్ యూత్ ఆధ్వర్యంలో 15 అడుగుల స్టార్‌ను బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు.