NZB: కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎస్సీ, బీసీ కాలనీ వాసులు సోమవారం ముట్టడించారు. ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. గత మూడు నెలల నుంచి నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.