ELR: ఇవాళ నుంచి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి వ్యవసాయాధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది, వ్యవసాయ అధికారులు రోజుకు 90 మంది రైతుల ఇళ్లను సందర్శించి, వ్యవసాయంలో పంచ సూత్రాలు, అగ్రిటెక్పై అవగాహన కల్పించాలని సూచించారు.