MDK: కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామం వద్ద కల్వర్టుపై నిద్రిస్తున్న వ్యక్తి ప్రమాదుశాత్తు కాల్వలో పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని కిష్టాపూర్ గ్రామానికి చెందిన నర్సగౌడ్గా గుర్తించి 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ప్రథమ చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.