SKLM: గ్రామ సచివాలయ వ్యవస్థలో గత ఏడేళ్లుగా పనిచేస్తున్నా తమకు తగిన గుర్తింపు, పదోన్నతులు లభించడం లేదని వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి భరోసా కల్పించారు.