గద్వాల పీజీ సెంటర్‌పై యూనివర్సిటీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బి. ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లను సందర్శించిన ఆయన, సరైన సౌకర్యాలు లేక విద్యార్థులే వంట చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. ముఖ్యంగా, రాత్రివేళల్లో లైట్లు లేకపోవడం, హాస్టల్ సమీపంలో గడ్డిలో పాములు ఉన్నాయన్నారు.