GNTR: తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని డివిజన్ కమిటీ సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్‌తో పాటు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ కార్మికుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.