SRD: భారతి నగర్ డివిజన్లో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి బస్తీ దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ ఇంజినీరింగ్ శాఖ, జలమండలి అధికారులతో కలిసి ఓల్డ్ MIG కాలనీని సందర్శించిన ఆమె అక్కడి సమస్యలను సమీక్షించారు. ఇంటి నం. 2433 వద్ద తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. అత్యవసరంగా CC రోడ్లు, UGD లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.