MHBD: తొర్రూరు మండలంలోని సోమారం గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు నీటి పంపు వెళ్లేందుకు వీలుగా రహదారి, కల్వర్టు నిర్మించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే రహదారి మరమ్మతు నిమిత్తం రైతులకు రూ.10,000 అందజేశారు. త్వరలో రహదారి, కల్వర్టుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.