SRD: ఫౌండేషన్ లిటరసీ న్యూమరసి (FLN) కార్యక్రమాన్ని టీచర్లు సమర్థవంతంగా నిర్వహించాలని MEO నాగరం శ్రీనివాస్ అన్నారు. శనివారం సిర్గాపూర్ హైస్కూల్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులకు చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు తప్పకుండా నేర్పాలని సూచించారు. FLS సర్వే కోసం 3వ తరగతి విద్యార్థులకు గణిత ప్రక్రియల అభ్యసన చేయించాలన్నారు.