AKP: నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి వచ్చిన సారిపల్లిపాలెంకు భక్తురాలి తనయుడు పావు తులం వెంకటేశ్వర స్వామి బంగారు ప్రతిమను ఆలయ ప్రాంగణంలో పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు వెతికించడంతో బంగారు ప్రతిమ దొరికింది. తిరిగి దానిని భక్తురాలు సారిపల్లి సాయికి ప్రధాన అర్చకులు అందజేశారు.