HYD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు పుష్ప గుచ్చాన్ని అందజేసి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్- 2025ను ఆమె ప్రారంభించనున్నారు.