KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం వైరాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వైరాలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత జరిగే సభలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతారని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ వెల్లడించారు.