MLG: వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి గురువారం సాయంత్రం బదిలీ కాగా..ఆయన స్థానంలో వెంకటాపురం (కే) రేంజర్ వంశీకృష్ణకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఐదేళ్లుగా వాజేడు రేంజ్లో విధులు నిర్వహించిన చంద్రమౌళిని అటవీ శాఖ ఉన్నతాధికారులు భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు రేంజికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇప్పటికే కొత్త పోస్టింగ్‌లో చేరారు.