E.G: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన అన్నాచెల్లెళ్లు వర్ష, జతిన్ రెడ్డిలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి, అభినందించారు. విశాఖ వేదికగా జరిగిన క్రికెట్ పోటీల్లో రాణించిన వర్ష స్కూల్ గేమ్స్ ద్వారా నేషనల్స్‌కు ఎంపికైంది. ఆమె సోదరుడు జతిన్ రెడ్డి కేవీ స్కూల్, ONGC తరపున జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు.