TPT: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో బుల్లి రామయ్యను హనుమంతుడు మోస్తున్న సన్నివేశం భక్తులను మైమరపించింది. వాటితోపాటు మాడ వీధుల్లో కోలాటం ఆడిన శ్రీనివాసుడు, రాధా కృష్ణ వేషధారణలు అలరించాయి.