ATP: గుత్తి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించి, వాటిని పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు.