ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసి యువతకు తోడ్పాటు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చిరంజీవి అన్నారు. బుధవారం వాంకిడి మండల అభివృద్ధి అధికారి పాటిల్ జోష్నాను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిఒక్కరికి ‘రాజీవ్ యువ వికాస్’ పథకాన్ని అందించాలని కోరారు.