GDWL: మహిళలు తమ సామర్థ్యాలను గుర్తించి సమాజంలో పురుషులతో సమానంగా ఎదగాలని ఇందిరా గాంధీ తరచుగా చెప్పేవారని అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు పేర్కొన్నారు. బుధవారం అయిజ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కురువ జయన్న ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.