ASF: ఆసిఫాబాద్ మండలం అర్జుని గ్రామ పంచాయతీ కొలంగూడ గ్రామంలో ఇవాళ పీఎం శ్రీ పథకం కింద మంజూరైన నూతన గిరిజన ప్రభుత్వ పాఠశాల భూమి పూజలో ఎమ్మెల్యే కొవ్వలక్ష్మి, ఎంపీ గోడం నగేష్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ చేసారు. నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.