WNP: బీసీ జేఏసీ కార్యచరణలో భాగంగా జేఏసీ ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో ఈనెల 16న బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి తెలిపారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని మర్రికుంట ధర్నా చౌక్‌లో బీసీల న్యాయ సాధన దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ ఆయన పోస్టర్ విడుదల చేశారు.