TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 31.88 శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు పోలింగ్ 20.76 శాతం, ఉదయం 9 గంటలకు పోలింగ్ 9.2 శాతం నమోదైన విషయం తెలిసిందే.