భారత వైమానిక దళంలోని మిగ్-21 యుద్ధ విమానాలు (MiG-21 Fighter Jets) తరచూ ప్రమాదాలు గురవుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది పైలట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల రాజస్థాన్(Rajasthan)లోని బార్మేర్ జిల్లాలో మరో మిగ్ విమానం కూలిపోయింది.యుద్ధ విమానాల విషయంలో వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకున్నది. అయితే, విచారణ పూర్తయి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే వరకు మిగ్-21 విమానాలను నిలిపివేస్తున్నట్లు రక్షణ శాఖ (Department of Defense) అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌ఫోర్స్‌లో మూడు MiG-21 స్క్వాడ్రన్లు మాత్రమే పనిచేస్తున్నాయి.
రాబోయే రెండేళ్లలో దశలవారీగా వాటిని రక్షణశాఖ వాటిని తొలగించనున్నది. భారత వైమానిక దళంలో 31 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (Yearcroft )స్క్వాడ్రన్లు ఉన్నాయి. వాటిలో మూడు మిగ్-21 బైసన్ వేరియంట్. 1960లలో భారత వైమానిక దళంలోకి MiG-21 ప్రవేశపెట్టారు. ఇటీవల మిగ్ యుద్ధ విమానాలు ఇటీవల ప్రమాదాలకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలోనే దశలవారీగా ఆ విమానాలను తొలగించేందుకు రక్షణ శాఖ వ్యూహ రచన చేస్తున్నది. ఎయిర్‌ఫోర్స్(Air Force)లోకి అధునాతన మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్తో పాటు ఎల్సీఏ మార్క్-1ఏ, ఎల్సీఏ మార్క్-2లతో సహా స్వదేశీ విమానాలను చేర్చాలని చూస్తున్నది.