అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ పడింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. జపాన్ సూచీ నిక్కీ 7శాతం పతనమైంది. 1000 పాయింట్లకు పైగా డౌ ప్యూచర్స్ పడిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లపైనా క్రూడాయిల్ ప్రభావం పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ నష్టాలు కనిపించే అవకాశం ఉంది. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.