ఏపీ లో 2019 రాజోలు (Rajolu) నుంచి గెలిచిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasada ) గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వత కొద్ది రోజులకే ఆయన వైసీపీ(YCP) కి దగ్గరయ్యారు. ప్రస్తుతం రాపాకకు జనసేన (Janasena) పార్టీతో ఏమాత్రం సంబంధాలు లేవనే చెప్పాలి. తాజాగా మరోసారి ఆయన సీఎం జగన్ (CM JAGAN)పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డ్ (Wedding card)పై ఏపీ సీఎం వైఎస్ జగన్, భారతి దంపతుల ఫోటోను అచ్చు వేయించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే రాపాక , నాగరత్నం దంపతుల కొడుకు వివాహం (Marriage) జూన్ 7వ తేదీ రాత్రి 1.02 గంటలకు జరగనుంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రికపై సీఎం జగన్ దంపతుల ఫొటోను ప్రింటింగ్ చేశారు ‘‘మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో..’’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియా (Social media) లో ఈ రాపాక వారి పెండ్లిపిలుపు బాగా సందడి చేస్తోంది.