ELR: కవల పిల్లలు, సాయి, లక్ష్మి మృతి ఘటనలో అత్తవారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సత్య సుధామ, వ్యవస్థాపక ఛైర్మన్ తోకల రాజేష్ డిమాండ్ చేశారు. నూజివీడులోని అమర్ భవన్లో వారు శనివారం మాట్లాడుతూ.. మృతురాలి అత్త, మామ, తోడికోడలు, బావలకి కఠిన శిక్షలు అమలు అయ్యేలా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.