కోనసీమ: రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపడుతున్న విద్యుత్ స్తంభాల మార్పు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. వాడపాలెం – కొత్తపేట రోడ్డు విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాల మార్పు (లైన్ షిఫ్టింగ్) పనులకు శుక్రవారం ఆయన, కొత్తపేట జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్‌తో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.