అనుమానపు Husband.. తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే..!
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగింది. కానీ వారి మధ్య అనుమానం మొదలైంది. భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానం భర్తలో మొదలైంది.దీంతో వారి మధ్య ప్రేమ మాయం అయ్యింది. అనుమానంతో భర్త, భార్యను రోజూ చిత్ర హింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఆ చిత్ర హింసలు భరించేలేక ఆమె ఏకంగా భర్తను చంపేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్ కు చెందిన మనోజ్ చౌహాన్(35) అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే యువతిని ప్రేమించి పెళ్లి(Love marriage) చేసుకున్నాడు. వీరు పని కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి సెటిల్ అయ్యారు. అయితే.. తాను రోజూ ఆఫీసుకు వెళ్లిన తర్వాత భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం అతనిలో మొదలైంది. ఓ రోజు ఆమె ఎవరితోనో ఫోన్ మాట్లాడటం చూసి ఆరోజు నుంచి అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో వారికి రోజూ గొడవలు అయ్యేవి. ఆమెను ప్రతిరోజూ వేధించేవాడు.
ఆ వేధింపులు తట్టుకోలేక పీకలదాకా తాగి ఉన్న భర్త తలపై బండరాయితో మోది హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. పోలీసులకు ప్రశ్నించగా, తనకు భర్తతో గొడవ అయ్యిందని, దాంతో తాను కోపంతో పిల్లలను తీసుకొని బయటకు వచ్చానని, తిరిగి వచ్చేలోపు ఇలా చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పడం గమనార్హం. కాగా.. పోలీసులకు ఆమె మాటలు అనుమానం కలిగించడంతో తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో ఆమె తాను చేసిన నేరం అంగీకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.