AP: వైసీపీ హయాంలో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని తెలిపారు. పిల్లలు చదవకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలు పూర్తి అవుతాయి.. కానీ, చంద్రబాబుకు మనుసు రావడంలేదన్నారు.