ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలతో నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదైంది. ఈ కేసులో నిధుల మళ్లింపులో నలుగురు కీలక వ్యక్తులను దర్యాప్తు బృందం గుర్తించింది. ఇప్పటికే వారిని ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేయగా.. వారిలో ఒకరు విచారణకు హరజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ నలుగురు కంపెనీలో ఉన్నత పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు.