Priyanka Chopra:ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సిటాడెల్ (citadel) వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. సిరీస్ కన్నా పర్సనల్ లైఫ్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆమె కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు. తాను ఇదివరకు చాలా మందితో డేట్ చేశానని.. చివరికీ నిక్ జోనస్‌ను (nick jonas) ప్రేమించి పెళ్లి చేసుకున్నానని వివరించారు. నిక్ కూడా తనలాగే చాలామందితో డేట్ చేసిన తర్వాత.. తమ మనసులు కలిసి ఒక్కటయ్యామని చెప్పారు.
ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఒప్పుకుంటారా అనే ప్రశ్న ప్రియాంకకు (Priyanka) ఎదురయ్యింది. ఆమె తడుముకోకుండా.. అవునని చెప్పారు. దీంతో ఒకరిపై మరొకరికి నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు. భవిష్యత్‌లో మనతో ఎలా ఉంటారో అనే విషయాలు తెలుస్తాయని చక్కగా వివరించారు. పెళ్లికి ముందు తాను చాలా మందితో డేట్ చేశానని.. ఎక్కువ కాలం నిలువలేవని గుర్తుచేశారు. ఇండస్ట్రీలో ప్రముఖులతో డేట్ చేశానని చెప్పారు. ప్రియాంక (Priyanka) చేసిన బోల్డ్ కామెంట్స్ చర్చకు దారితీశాయి. నిక్-తాను ఇద్దరం అన్నీ అంశాలు కలిసి మాట్లాడుకుంటామని.. తమ మధ్య ఏ దాపరికం లేదని అంటున్నారు.
నిక్ జోనస్‌తో డేటింగ్ చేసి.. ఆ తర్వాత పెళ్లి (marriage) చేసుకున్నానని ప్రియాంక (Priyanka) తెలిపింది. ఆమె కన్నా నిక్ పదేళ్లు చిన్నవాడు అనే సంగతి తెలిసిందే. 2018లో వీరికి పెళ్లి కాగా.. లాస్ట్ ఇయర్ సరోగసి విధానంలో పాపకు జన్మనిచ్చింది. తన బిడ్డతో కలిసి ఇండియాలో పర్యటించింది.
సిటాడెల్ (citadel) వెబ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా పవర్ ఫుల్ పాత్ర పోషించినప్పటికీ.. శృంగార సన్నివేశాల్లో నటించే సమయంలో ఇబ్బంది పడ్డానని చెప్పింది. సిటాడెల్ హిందీ వెర్షన్లో ప్రియాంక రోల్‌ను సమంత పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ షూట్ ప్రారంభం కావాల్సి ఉంది.