ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేయనుంది. కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఖర్చుల్ని తగ్గించేందుకు ఈ తొలగింపులు చేపట్టనుంది. అమెజాన్ కార్యకలాపాలు చురుగ్గా సాగడానికి ‘లే ఆఫ్లు’ దోహదపడతాయని కంపెనీ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్ పేర్కొన్నారు. తొలగించనున్న ఉద్యోగులకు తాము సాయం అందిస్తామని తెలిపారు.