కేరళకు చెందిన ఓ మహిళ 1991లో వివాహం చేసుకోగా 2001లో ఓ కుమారుడు పుట్టాడు. 2003లో భర్తతో విడాకులు తీసుకుంది. అయితే తాను వివాహేతర బంధంతో బిడ్డను కన్నానని.. తన బిడ్డ తండ్రి పేరు మార్చాలని 2006లో కోరగా.. అధికారులు నిరాకరించారు. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించగా 1872లోని సెక్షన్ 112 ప్రకారం వివాహ బంధంలో ఎవరితో పిల్లలను కన్నా భర్తే తండ్రిగా ఉంటాడని కోర్టు స్పష్టం చేసింది.