WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. నేడు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. ఈ క్రమంలో మార్కెట్ రేపు ప్రారంభం అవుతుండగా.. రైతులు నాణ్యమైన, తేమలేని పత్తిని, సరుకులను మార్కెట్కు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.